కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం… గేట్ నెంబర్ 19 కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో బీభత్సంగా తుంగభద్ర డ్యామ్ లో ఉన్న నీరు… వృధాగా బయటకు వెళ్తోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.
అయితే 105 టిఎంసిల కెపాసిటీ కలిగి ఉన్న… తుంగభద్ర డాం… 60 టీఎంసీల నీరు వృధాగా దిగువకు వదిలి పెట్టాల్సి వచ్చింది. 19వ గేట్ రిపేర్ చేయాలంటే… నీటిని కిందికి వదలాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో..60 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఆ నీరంతా సుంకేసుల నుంచి… శ్రీశైలం కు రానుంది.