నా రాజకీయ జీవితమే ఉదాహరణ..!

-

రెండున్నర నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంటికే వచ్చే పెన్షన్‌ విధానం పోయింది. ఇంటికే వచ్చే రేషన్‌ విధానం పోయింది అని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఇ-క్రాప్‌, ఉచిత పంటల భీమా పోయింది. శాంతి భద్రతలు నీరుగారిపోయాయి. దిశ యాప్‌ కూడా పోయింది. గ్రామాల్లో ఇంటింటికీ సేవలు నిలిచిపోయాయి అని తెలిపారు.

అలాగే ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా కుంటిపడ్డాయి. ఎన్నికl కోడ్‌ కారణంగా.. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ చెల్లింపులను ఇవ్వడంలేదు. ప్రతిమూడునెలలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 2 త్రైమాసికాలు అయిపోయిన డబ్బులు ఇవ్వడంలేదు. చంద్రబాబు మోసపూరిత హామీలు కారణంగా ఎన్నికలలో ప్రజలు కాస్త అటువైపు మొగ్గారు. ఇప్పుడు ప్రజలను మళ్లీ చంద్రబాబు మోసం చేస్తున్నాడు. ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు కారణంగా చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. కష్టాలు అనేవి లేకుండా ఉండవు. ప్రతి రాత్రి తర్వాత మళ్లీ పగలు రాక తప్పదు. నా రాజకీయ జీవితమే ఇందుకు ఉదాహరణ. వేధింపుల్లో భాగంగా నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా నిబ్బరంతో, వ్యక్తిత్వంతో నిలబడాలి అని జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news