ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓసారి బయటికి వచ్చి మళ్ళీ జైళ్ళోకి వెళ్ళారు.అంతకు ముందు మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారారు. ఇటీవల ఆప్ నేత శిషోడియా జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. కానీ ఇదే కేసులో జైలుకెళ్ళిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికీ విడుదల కాలేదు. పలుమార్లు కెటిఆర్,హరీష్‌రావు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపి వచ్చారు. కవితను కూడా పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు.
బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటీషన్‌లను కోర్టు తీసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో అసలు కవిత జైలు నుంచి విడుదల అవుతుందా.. లేక అక్కడే ఉంటుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ కేసులో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటే ఆమె మాత్రం విడుదల కాకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వంతో కేసీఆర్ రాజీపడే వరకు ఆమె జైల్లోనే ఉండాలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
లిక్కర్ స్కాకమ్ కేసులో గత మార్చి 15న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి అంటే… గత 5 నెలలుగా ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ వారంలో ఆమె బెయిల్‌పై బయటకు వస్తారని ఆమె సోదరుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక మోడీ ప్రభుత్వంతో కేసీఆర్ ఏదో విదంగా రాజీపడి ఉండవచ్చని అందరూ అనుకున్నారు.
అలా అనుకోవడం తప్పన్నారు కేటీఆర్. అది తప్పో ఒప్పో అన్న సంగతి అటుంచితే ఆయన చెప్పిన్నట్లు కవితకి ఈసారి కూడా బెయిల్ రాలేదు.ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆగస్ట్ 20కి మళ్ళీ వాయిదా వేసింది. కనీసం అంత వరకు మద్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్ధించినా సుప్రీంకోర్టు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ కేసులో కవితే కీలక వ్యక్తి అని,బయటికి వస్తే సాక్షులను తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థలు కోర్టుకి విన్నవించుకున్నాయి. లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ధ్వంసం చేశారని కవితపై అభియోగం ఉంది.అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా ఉన్న ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని దర్యాప్తు సంస్థలు వాదిస్తున్నాయి.
సీబీఐ, ఈడీ వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది.ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తదితరులందరికీ బెయిల్ ఇచ్చి కవితకు బెయిల్ ఇవ్వకపోవడం ఏమిటనే ముకుల్ రోహత్గీ వాదనలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పట్టించుకోలేదు. ఆమెకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సీబీఐ, ఈడీలు తమ వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ ఈ నెల 20కి ఈ కేసుని వాయిదా వేసింది.
ఈ 15వ తేదీన దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోనున్నారు. కానీ కవితకు మాత్రం స్వాతంత్ర్యం రావడం లేదని సెట్లైర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల కెటిఆర్ చేసిన కామెంట్‌పైన కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. 5 నెలల్లో కవిత 11 కిలోల బరువు తగ్గారని కెటిఆర్ చెప్పగా పలువురు నెటిజెన్‌లు…బరువు తగ్గాలనుకుంటే తీహార్ జైలుకి వెళ్ళండి అంటూ మీమ్స్ వదులుతున్నారు. బిఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేసి ఉంటే ఈపాటికి కవిత కేంద్ర మంత్రి అయ్యుండేవారు కదా అని కామెంట్లు కూడా వస్తున్నాయి. కవితకు జైలు నుంచి త్వరలోనే విముక్తి లభించాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.