భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీలుపై మరోసారి కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. మొదట మంగళవారం రోజున తీర్పు వెల్లడిస్తామని చెప్పిన కాస్.. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 9.30 గంటలకు వాయిదా వేసింది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాములు అదనంగా బరువు ఉందని వినేశ్‌పై అనర్హత వేటు వేయడంతో ఆమెకాస్‌కు అప్పీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాస్ తీరుపై ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. రోజూ వాయిదా వేస్తూ పోతారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కాస్ తీరు చూస్తుంటే సినిమాల్లో కోర్టులో తరచూ తీర్పు వాయిదా పడే సీన్లు గుర్తొస్తున్నాయి ఓ యూజర్ కామెంట్ చేయగా.. రోజూ వాయిదా వేసుకుంటూ పోవడం భలేగుంది. ఆర్బిట్రేషన్ ఏం చెప్పదల్చుకుందో తెలియడం లేదంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ‘ఇలాగే వాయిదా వేస్తూ పోతే చివరకు తీర్పు ఏమిచ్చినా ఎవరూ పట్టించుకోరని కాస్ భావిస్తున్నట్లుంది. అది మేం ఒప్పుకోం వినేశ్‌కు న్యాయం జరగాల్సిందే’నంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.