మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

-

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు శుభవార్త చెప్పింది. ఉద్యోగినుల కోసం నెలలో ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని తెలిపింది.  కటక్‌లో జరిగిన స్వాతంత్య్ర  వేడుకల్లో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పార్వతి పరీదా ఈ శుభవార్త చెప్పారు.

అనంతరం ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకునేలా రూపొందించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.  మహిళలకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తోంది.  కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్‌ లీవ్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news