ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్ , ఫాంహౌస్ లో ఉండేది కేసీఆర్ అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ,సీఎం రేవంత్ రెడ్డికి కావాల్సింది ప్రజా పరిపాలన.. అలాగే కేసీఆర్, కేటీఆర్ లకు కావాల్సింది ఉప ఎన్నికలు అని అన్నారు. పదేళ్ళలో మీరు చేయలేని రుణమాఫీని.. మేము 8 నెలల్లో అది కూడా ఓకే కిస్తీలో రుణమాఫీ చేస్తే ఎందుకు మీ ఏడుపులు అని ప్రశ్నించారు.
రైతు లు సంతోషంగా ఉండాలని BRSకు లేదు. అధికారం లో ఉంటే ఫాంహౌస్, అధికారం లేకపోతే ఉప ఎన్నికలు.. ఇది BRS సిద్దాంతం అని పేర్కొన్నారు. ప్రతిపక్షం లో ఉంటే ప్రజా సమస్యల పై పోరాటం ,అధికారం లో ఉంటె ప్రజా సమస్యల పరిష్కారం ఇది కాంగ్రెస్ సిద్దాంతం. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం సోనియా గాంధీని ఢిల్లీకి వెల్లి కలసారు కదా.. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా.. అయినా మీది గళ్ళీ పార్టీ, మాది ఢిల్లీ పార్టీ అని జగ్గారెడ్డి అన్నారు.