వీడియో; గొంతు కోస్తూ వికెట్ సెలెబ్రేట్ చేసుకున్న బౌలర్

-

ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మక టి20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ కొత్త సీజన్ జరుగుతోంది. బ్యాట్స్మెన్ ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఈ టోర్నీలో బౌలర్లు కూడా చెలరేగిపోతున్నారు. బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తూ ఈ లీగ్ లో తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా యువ బౌలర్లు వచ్చిన అవకాశాలను ఇదిలా ఉంటే ఈ టోర్నీలో ఒక బౌలర్ చేసిన చేష్ట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారిందివినియోగించుకుంటూ క్రమంగా వికెట్లు తీస్తూ జట్టులో కీలక ఆటగాళ్ళు గా మారుతున్నారు.

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో 10 వికెట్లతో రాణించాడు. 26 ఏళ్ల ఈ బౌలర్ బ్యాట్స్మెన్ కి చుక్కలు చూపిస్తున్నాడు. అయితే వికెట్ తీసిన తర్వాత అతను సంబరం చేసుకునే విధానం మాత్రం ప్రపంచాన్ని భయపెట్టింది. డేల్ స్టెయిన్ స్థానంలో మెల్బోర్న్ స్టార్స్ జట్టులోకి తీసుకువచ్చిన హరిస్ రౌఫ్,

సిడ్నీ థండర్స్ తో జరిగిన మ్యాచ్ లో డేనియల్ సామ్స్‌ను అవుట్ చేసిన తరువాత, బౌలర్ గొంతు కొస్తున్నట్టు సంబరాలు చేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు అది ఆస్ట్రేలియా కల్చర్ కాదని, అతను మంచి బౌలర్ అయినా సరే ఇలాంటి చేష్టలు క్రికెట్ ని భయపెడుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news