హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే గత నాలుగు ఐదు రోజులుగా నగరంలో వర్షం నిత్యం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు ఎవరియాన్ సరే అవసరం ఉంటేనే తప్ప బయటకు రాకూడదు అని సూచించింది. అయితే ఈ రోజు హైదరాబాద్ అలాగే చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది.
మెదక్‌లో గంటన్నర నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ఇప్పటివరకు మెదక్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వర్షానికి బైక్‌లు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. అయితే హైదరాబాద్ లో మరో నాలుగు రోజులు ఇదే విధమైన వర్షాలు పడే అవకాశం అనేది ఉంది అని తెలిపింది వాతావరణ శాఖ.