తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రాజధాని హైదరాబాద్ కు ఇప్పటికే అధికారులు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసారు. ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదు అని సూచించారు. అయితే తెలంగాణలోనే అత్యధికంగా కరీంనగర్ జిలాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాంతంలో 16.9 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయ్యినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పూడూర్ లో 9.2 సే.మీ, కొయ్యూరు 10.6 సెమీ, ఈదులగట్టెపల్లి 8.5 సెమీల వర్షపాతం నమోదు కాగా ఇందుర్తి, మల్లాపూర్, వీణవంక ల్లో 8 సెంటిమిటీర్ల చొప్పున వర్షం నమోదు అయ్యినట్లు అధికారులు తెలిపారు. ఇక గుండి,7.6 సె.మీ, గంగాధర 7.4 సె.మీ, జగిత్యాల 6.9 సె.మీ, నెరేళ్లలో 7.3 సెంటిమిటీర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే కరీంనగర్ వ్యాప్తంగా ఈవ్ వర్షాలు మరికొన్ని రోజులు ఉండనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.