Krishna Janmashtami 2024: కృష్ణుడు పుట్టిన రోజున కృష్ణాష్టమి పండుగని మనం జరుపుకుంటాము. దీనినే జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణ జయంతి ఇలా పలు పేర్లుతో పిలుచుకుంటాము. ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటాము. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు అని చాలామంది నమ్ముతారు. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని వివిధ రూపాల్లో అలంకరించి పూజిస్తారు. జన్మాష్టమి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి మంచి ఫలితం దక్కుతుంది. ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఆగస్టు 26వ తేదీన సోమవారం నాడు జరుపుకోవాలి. తెలుగు పంచాంగం ప్రకారం ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడబోతున్నాయి.
ఈ పర్వదినాన ఉపవాస దీక్షని చాలామంది ఆచరిస్తారు. ఇక వాటి వివరాలను చూద్దాం.. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 26 సోమవారం నాడు వచ్చింది. తెల్లవారుజామున 03:09 గంటలకు అష్టమి తిధి ప్రారంభమవుతుంది. ఆగస్టు 27 మంగళవారం అర్ధరాత్రి 02:19 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం 26 ఆగస్టు 2024 సోమవారం మధ్యాహ్నం 3:55 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 27న మంగళవారం మధ్యాహ్నం 3:38 గంటలకు ముగుస్తుంది. ఒక పూట భోజనం చేసే కృష్ణుడికి పూజ చేసి వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.
పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయి. శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో పుట్టాడు. కాబట్టి చీకటి పడిన తర్వాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే మంచిది. సంతానం లేని వాళ్ళు పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయి. రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి కన్నయ్యకు పూజలు చేసి ఆ మరుసటి రోజున ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:38 గంటలకు ఉపవాసాన్ని విరమించాలి.