3 గోనే సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు..!

-

పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుండి 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ల కోసం ఈ పాత ఫోన్లను వాడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్ ఇచ్చి ఫోన్లు కొంటుంది ముఠా. మ్మొత్తం 3 గోనే సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

బీహార్ కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికర్ అరెస్ట్ చేశారు గోదావరిఖనీ పోలీసులు. గోదావరిఖనీ పవర్ హౌజ్ కాలనీ లో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ జిల్లాల్లో గ్రామల్లో మొబైల్ ఫోన్లు కొని బీహార్ మీదుగా… జామ్ తారా, దేవ్ ఘర్, జార్ఖండ్ తరలిస్తోంది ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు అమ్మేముందు.. మొబైల్ ఫోన్స్ లో సాప్ట్ వేర్ మార్చడం, ఇతర విడిభాగాలు మార్చి.. ఫోన్ పనిచేసేలా మార్చి అమ్ముతుంది. అందుకే గుర్తు తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్లను అమ్మవద్ధని పోలీసులు ప్రజలకు సూచనలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news