ఎసెన్షియా బాధితులకు కనీసం నీళ్లు ఇచ్చేవారే లేరు..!

-

ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు మాజీ మంత్రి, YCP నాయకుడు బొత్స సత్యనారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీ యాజమాన్యం ప్రమాదం జరిగిన‌ తరువాత కాదు ముందుగా ఉద్యోగుల భద్రత చూడాలి అని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రాణాలను తీసుకురాలేము కానీ. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన బాధ్యత యాజమాన్యలకు ఉంది అని సూచించారు బొత్స.

అలాగే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వం మేలుకొని త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలి. అయితే మేము కేజీహెచ్ లో బాధితులను పరామార్శించాం.. వాళ్లకి కనీసం నీళ్లు ఇచ్చేవారు కూడా లేరు అని బొత్స అన్నారు. అధికారులను అని విధాలుగా సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ముందుగా బాధితులను పరామర్శించమని మమ్మల్ని పంపారు. రేపు అనకాపల్లి లో చికిత్స పొందుతున్న వారిని జగన్ మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించనున్నారు అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news