36 మంది సైబర్ క్రైమ్ నేరస్థులు అరెస్ట్..!

-

సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్లో ఓ ఆపరేషన్ నిర్వహించారు. అపరేషన్ లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్ లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారు అని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా సుమారు వెయ్యి కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.. ఇందులో 20 కేసులో నిందితులు సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా ఫ్రాడ్ చేశారు. ఇందులో గతంలో 4.4 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశాం.. ఫ్రీజ్ చేసిన డబ్బులో ఇప్పటికే బాధితులకు ఒకటిన్నర కోట్లు రిఫండ్ చేసాం.

నిందితుల వద్ద నుండి 38 లక్షల నగదు బంగారం లాప్టాప్స్, బ్యాంక్ చెక్ బుక్స్ పాస్ బుక్స్ సీజ్ చేసాం. సెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను కూడా సీజ్ చేసాం. నిందితులపై తెలంగాణ వ్యాప్తంగా సుమారు 150 కేసులు ఉన్నాయి. నగరంలో నిందితులు చేసిన మూడు మేజర్ క్రైమ్స్ ఉన్నాయి. ట్రేడింగ్ పేరిట చేసిన మోసాల్లో ముగ్గురును ఆరెస్ట్ చేసాం. ఇందులో కనాని నికుంజ్ కిషోర్ భాయ్ అనే చార్టెడ్ అకౌంట్ ఉన్నాడు. ప్రవీణ్ భాయ్ తో పాటు మరో నిందితుడు ద్వారా చార్టెడ్ అకౌంటెంట్ ఈ నేరాలకు పాల్పడ్డారు. ముందుగా నిందితులు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రాం లో లింక్ సెండ్ చేస్తారు. అందులో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తారు అని సీపీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news