Bacteria vs Virus : బాక్టీరియా, వైరస్ మధ్య తేడా ఏంటి..? రెండు ఒక్కటేనా..?

-

Bacteria vs Virus : చాలామంది బ్యాక్టీరియా వైరస్ మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే అసలు బ్యాక్టీరియా అంటే ఏంటి..? వైరస్ అంటే ఏంటి అని దాని గురించి చూద్దాం. బ్యాక్టీరియా వైరస్ల మధ్య ముఖ్యమైన తేడా గురించి మీకు తెలుసా..? బ్యాక్టీరియా వైరస్ల మధ్య ప్రధానమైన ఒక తేడా ఉంది. అదే వాటి పరిమాణం.

  • బ్యాక్టీరియా ఒక మైక్రోమీటర్ ఉంటే వాటి పొడవు ఒకటి నుంచి మూడు మైక్రో మీటర్లు ఉంటుంది. ఒక వైరస్ పొడవు 0.02 నుంచి 0.3 మైక్రో మీటర్లు మాత్రమే.
  • బ్యాక్టీరియా అయితే స్వతంత్రంగా సంతాన ఉత్పత్తి చేయగల సూక్ష్మజీవి. వైరస్ పునరుత్పత్తికి జీవం ఉన్న వేరే కణాలపై ఆధారపడి ఉంటుంది.
  • వైరస్లలో ఒక రకమైన న్యూక్లియర్ ఆసిడ్ అనేది ఉంటుంది. వాటి ప్రాథమిక రూపం అయిన వాటి సంతతి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ మాత్రమే కలిగి ఉంటుంది.
  • ఇక బ్యాక్టీరియా విషయానికి వస్తే.. బ్యాక్టీరియాలో జన్యు సంబంధిత సమాచారం పూర్తిగా ఉండడమే కాక ఇతర జీవ ప్రక్రియలను కొనసాగించడానికి కావాల్సిన అన్ని రకాల ఆర్ఎన్ఏ ను కలిగి ఉంటుంది.
  • బ్యాక్టీరియాని ఎదుర్కోవడం చాలా ఈజీ ఎందుకంటే వాటి జీవ ప్రక్రియను యాంటీబయోటిక్స్ మందులతో అంతమొందించి చంపడానికి అవుతుంది.
  • వైరస్ ఉత్పత్తి వేరే కణాల జీవ ప్రక్రియపై ఆధారపడి ఉండడంతో వాటిపై యాంటీబయోటిక్స్ పనిచేయవు.
  • ఈరోజుల్లో వైరస్లని అంతమందించడానికి కొన్ని మందులు మాత్రమే ఉన్నాయి. అయితే చాలా బ్యాక్టీరియా హానికరమైనవి కాదు. వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి మీజిల్స్, పోలియో, కోవిడ్ 19 మాత్రం చాలా తీర్వ్రమైనవి.
  • రెండు కూడా మైక్రోస్కోపిక్. అలాగే ఈ రెండు కూడా ఇన్ఫెక్షన్స్ ని కలిగిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news