సీనియర్లు లేకుండా తెలంగాణలో టిడిపి మనుగడ సాధించగలదా..? చంద్రబాబు సక్సెస్ అవుతారా..

-

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. పార్టీని గాడిలో పెట్టడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఆయన భావిస్తున్నారు.. అందులో భాగంగా హైదరాబాదులో టిడిపి ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఉండగా తెలుగుదేశం పార్టీ బలోపేతం సాధ్యమవుతుందా అనే సందేహం అందరిలోనూ మెదులుతోంది..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. గ్రామీణ ప్రాంతాలలో ఆ పార్టీని మరిచిపోయి చాలా సంవత్సరాలు అయిందనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అసలు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి క్యాడర్ లేదనే వాదన వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాలు హైదరాబాద్ వంటి నగరాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో నేతలు కూడా లేరట.. ఈ క్రమంలో పార్టీని బతికించాలంటే చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ నేతలు చెబుతున్నారు.. ప్రజల్లో పార్టీ మీద సానుకూలత రావాలంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని, అప్పుడే పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుందని నేతలు చర్చించుకుంటున్నారు..

గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. అప్పటి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే విషయంలో పార్టీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దాంతో టిడిపిలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పక్క పార్టీల్లో చేరారు.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. టిడిపి నేతలు ఉద్యమాలు పోరాటాలు చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. బిజెపి బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెసును ముప్పుతిప్పలు పెడుతున్నాయి.. ఇలాంటి సమయంలో మూడు పార్టీలను ఎదుర్కొని పోటీలోకి రావాలంటే చంద్రబాబు తెలంగాణపై గట్టిగా దృష్టి పెట్టాలని సీనియర్ నేతలు కోరుతున్నారు.. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Latest news