ప్రతి ఒక్కరు కూడా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలనుకుంటారు. అయితే కొంత మంది సెన్సిటివ్ గా ఉంటారు. అలాంటి వారితో ఎలా హ్యాపీ గా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇలా చేశారంటే మాత్రం మీ వైవాహిక జీవితం అదిరిపోతుందంతే.
చెప్పేది జాగ్రత్తగా వినండి
సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ప్రతి దానికి కూడా అలుగుతూ ఉంటారు. వాళ్ల నుంచి ప్రేమని పొందాలన్నా, వాళ్ళతో హాయిగా ఉండాలన్నా ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది వినాలి.
కొన్ని కొన్ని చెప్పకపోతే అర్థం చేసుకోవాలి. అప్పుడే వారితో సంతోషంగా ఉండడానికి అవుతుంది.
కొంచెం స్పేస్ ఇవ్వండి
వారికి కాస్త స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి అలాగే పరిస్థితులు సరిగ్గా ఉండకపోతే వారితోనే ఉంటూ మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. అర్థం చేసుకోవడానికి కాస్త సమయం ఇవ్వాలి.
ఫీలింగ్స్
వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే వాళ్ళు అతిగా ఆలోచిస్తారు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి.
సర్ప్రైజ్ ఇవ్వండి
సెన్సిటివ్ గా ఉండే వాళ్ళకి నెగటివ్ పాజిటివ్ ఎమోషన్స్ ఫాస్ట్ గా మారిపోతూ ఉంటాయి. వారికి సర్ప్రైజ్ ఇవ్వడం, ఆనందంగా ఉంచడం చేస్తే కచ్చితంగా వాళ్ళు మీతో ఆనందంగా ఉంటారు.
వారితో కాస్త సమయాన్ని గడపండి
వారితో కలిసి కొద్దిగా వాకింగ్ కి వెళ్లడం లేదంటే వాళ్లతో పాటు ఇంటి పనులు చేయడం కలిసి ఉండడం మంచు నిర్ణయాలు తీసుకోవడం వారి భయాలను వినడానికి ప్రోత్సహించడం ఇలా చేస్తే కచ్చితంగా వాళ్ళు మీతో అన్ని కమ్యూనికేట్ చేస్తారు హాయిగా ఉంటారు ఇలా మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా ఉండొచ్చు