Gudlavalleru Engineering College: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో రహస్యంగా నిందితురాలు జంప్ అయింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించారు విద్యార్ధినులు. అయితే… రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్ధినిని తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు, అధికారులు.
అయితే.. ఈ విషయం తెలియగానే.. నిరసనకు దిగారు విద్యార్ధినులు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినులు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు అధికారులు. మరోసారి ఇవాళ పది గంటల తరువాత కాలేజీలో ఆందోళన కు సిద్ధం అవుతున్నారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధినులు. ఎంత ఆందోళన చేస్తున్నా… ఇంకా ఎటువంటి కెమెరాలు లేవని ప్రచారం చేస్తున్నారంటున్నారు విద్యార్ధినులు. తలిదండ్రులు వస్తేనే ఇళ్ళకు పంపుతామనడం పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు విద్యార్ధినులు.