Kidnapped child: కిడ్నాపర్‌పై మమకారం…తల్లి వద్దకు వెళ్లనంటున్న బాలుడు…!

-

Jaipur Kidnapped child cries on being separated from kidnapper: కిడ్నాపర్‌పై మమకారంతో…తల్లి వద్దకు వెళ్లనంటున్నాడు ఓ బాలుడు. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎత్తుకొచ్చిన కిడ్నాపర్‌పై మమకారంతో తల్లి చెంతకు చేరేందుకు నిరాకరించాడు ఓ కుర్రాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో 14 నెలల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడిని గుర్తించారు అక్కడి స్థానిక పోలీసులు.

Jaipur Kidnapped child cries on being separated from kidnapper

ఈ తరుణంలోనే.. ఆ కుర్రాడి తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ తరుణంలోనే…సంఘటనలో, ఒక విచిత్రమైన విషయం జరిగింది. తల్లి చెంతకు చేర్చే సమయంలో కిడ్నాపర్‌ను విడిచిపెట్టలేక కౌగిలించుకొని ఏడవడంతో, కిడ్నాపర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. కాగా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అటు చిన్నారి పరిస్థితి చూసి కిడ్నాపర్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news