అలాంటి వారి సభ్యత్వం రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వండి : కేఏ పాల్

-

పొలిటికల్ పార్టీల నేతలకు పార్టీలు మారడం కొత్త కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి పదవుల కోసం,తమ వ్యాపారాల కోసం, తమ అనుచరుల మెప్పుకోసం మారుతూనే ఉంటారు. అవకాశం ఎప్పుడు వస్తుందా? అని గోడ మీద పిల్లిలా ఎదురుచూస్తుంటారు. చాన్స్ రాగానే వెంటనే పాత కండువా మార్చి కొత్త కండువా కప్పుకుంటుంటారు. ప్రస్తుతం ఏపీలో అదే ట్రెండ్ కొనసాగుతోంది. మొన్నటివరకు వైసీపీ అధికారం అనుభవించిన నేతలు.. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోగానే అధికార తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సభ్వత్వాలను రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలని కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇప్పటికీ ఈ పిల్ పెండింగ్‌లో ఉండగా, మరోసారి ఎందుకని కోర్టు ప్రశ్నించింది. అయితే, గతంలోవి రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలైతే.. ప్రజెంట్ ప్రజాప్రయోజనాల కోసం దాఖలైందని పాల్ సమాధానమిచ్చారు.ఇదే విషయమై అఫిడవిట్ సమర్పిస్తే పరిశీలిస్తామని ఎల్లుండి విచారణను కోర్టు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news