ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి రూ.20,000..?

-

Annadata sukhibhava scheme: ఏపీ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పాలని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ స్కీం కింద 20,000 ఇవ్వాల్సి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న రూ. 6000 తీసేస్తే ఇంకా రూ.14000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పటికే ముగిసే టైం వచ్చేస్తోంది. ప్రభుత్వం ఇవ్వాలనుకున్న డబ్బుల్ని నిజానికి పెట్టుబడి సహాయం అంటే పంట వేయకముందే ఇవ్వాలి.

తద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. కానీ ప్రభుత్వం ఆ పని ఇంకా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం వలన రైతులకు ఇంకా ఈ సహాయం అందలేదు. ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా సూపర్ సిక్స్ లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మరో 10 రోజులు అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయిపోతుంది. ఖజానాల్లో చూస్తే డబ్బులు లేవు. వరదలు వలన రైతులు వరద బాధితులకు సహాయం చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది.

అందుకని సూపర్ సిక్స్ పథకాల అమలు ఇంకా సవాలుగా మారనుంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే దసరా లేదా దీపావళి పండుగకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించే అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరం రైతుల అకౌంట్లో 7,000 చొప్పున జమ చేసి మిగతా డబ్బును వచ్చే సంవత్సరం మార్చి 31 లోపు జమ చేస్తారని తెలుస్తోంది.

ఇది జరిగితే ఖరీఫ్ రబీ తో సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చినట్లు అవుతుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఇంకా రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ని రూపొందించే పనిలో ఉన్నారు, ఏపీ ప్రభుత్వం కూడా ఇలా గైడ్లైన్స్ ని రూపొందించాలి అనుకుంటే నిధులు విడుదల ఇంకా ఆలస్యం అవుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news