మాకు ఆహారం అందడం లేదు.. ముంపు ప్రాంతాల్లో ఆర్తనాదాలు

-

ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే, వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా తమ ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. అయితే, ఇంట్లోని సామగ్రి అంతా తడిచి పోవడంతో ఇప్పటివరకైతే ప్రభుత్వం అందించే ఫుడ్ పార్సిల్స్, పండ్ల మీదే ఆధారపడుతున్నారు. డ్రోన్లు, పడవల ద్వారా ముంపు గ్రామాల బాధితులకు ఆహారం అందజేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో తమకు ఆహారం అందడం లేదని పలువురు ఆందోళన చేస్తున్నారు.

 

ఇదిలాఉండగా, విజయవాడలోని ముంపుగ్రామాల బాధితులకు హెల్లికాప్టర్ల ద్వారా 7,220 కేజీల ఆహారం, తాగునీరు, మందులు అందించినట్లు సమాచారం. మార్కెటింగ్ శాఖ నుంచి 1.10 లక్షల యాపిల్స్, 90వేల అరటిపండ్లను పంపించారు. రానున్న రెండు రోజుల్లో 2.5 లక్షల అరటి పండ్లను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రధానంగా పెద్ద కాలనీల్లోని వారికి ఆహారం అందుతుందని, చిన్న కాలనీల్లోకి వారికి అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news