నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. లిస్ట్ లో 100 మంది ఉన్నారు : భూమా అఖిలప్రియ

-

ఆళ్లగడ్డ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. కళాశాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రిన్సిపల్ పై మండిపడ్డ ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పుకుంటున్నాడు. అయితే పేరుకే డిగ్రీ కాలేజ్ కానీ సరైన వసతులు కూడా ఇక్కడ లేవు. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేపిస్తున్నారు అని తెలిపారు భూమా అఖిలప్రియ.

అలాగే మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేంద్ర రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అతను కేవలం దొంగ ఓటర్ మాత్రమే. సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ ని తీసుకొచ్చి డిగ్రీ కాలేజీకి వేయించుకున్నారు. అయితే నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికి పైగా ఉన్నారు.. ఎవరిని వదలను అని అన్నారు భూమా అఖిలప్రియ. అంటే వారిని ఏదో నేను చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అని భూమా అఖిలప్రియ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news