Bigg boss 8: ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్ ఎవ‌రంటే..?

-

Bigg boss 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ మొత్తం గొడవలతో సాగింది సోనియా, ప్రేరణతో పాటుగా మిగిలిన కంటెస్టెంట్స్ గొడవలు, వాదనలు ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని నెటిజెన్స్ అంటున్నారు. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్ళిపోతారు అనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా సాగినట్లు అనిపించింది. సోనియా ప్రతీ మాటకు ఇతరులతో గొడవలు పడడం కామెడీగా ఉంది. ఆమె అరవడం అసలు ఏ విషయంలో దేనికోసం గొడవ పడుతుందో కూడా అర్థం కావట్లేదు.

ఆమెకి నిఖిల్ తో పాటుగా మిగిలిన వాళ్ళు సర్ది చెప్పడానికి ట్రై చేసినా కూడా వినలేదు. నైనిక, నబిల్, బేబక్క అలాగే మరికొంతమంది కంటెస్టెంట్స్ వాదనలు ఓవర్ యాక్టింగ్ గా కనిపించాయి. గొడవలు పెట్టుకుంటూనే ఆట ఆడుతున్నట్లు కనపడుతోంది. సోది ఎక్కువ అయిపోయిందని అంతా అంటున్నారు. రెండు రోజులు గొడవలు ఇలా ఉంటే ఇంకా రచ్చ రచ్చ ఉంటుందని ఫాన్స్ అయితే కామెంట్లు చూస్తున్నారు. విష్ణు ప్రియ, అభయ్ బిగ్ బాస్ గేమ్ ని ఎలా మొదలు పెట్టాలో తెలియని కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు ఉంది. అంత యాక్టివ్ గా అసలు లేరు. కెప్టెన్ పోస్ట్ ను చీఫ్ గా ఇప్పుడు మార్చారు. ఫస్ట్ వీక్ చీఫ్స్ గా నిఖిల్, నైనిక, యష్మి గౌడ లకు నామినేషన్స్ నుంచి మినహాయింపు వచ్చింది.

ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు…?

బిగ్ బాస్ ఎలిమినేషన్ లో బేబక్క, మణికంఠ, పృధ్విరాజ్, సోనియా, విష్ణు ప్రియ, శేఖర్ బాషా ఉన్నారు, ఈ వారం బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సీజన్స్ పరిశీలిస్తే ఫస్ట్ వీక్ లో వంటగది బాధ్యతలను తీసుకున్న కంటెస్టెంట్స్ బయటికి వచ్చేసారు. హేమ, కరాటే కళ్యాణి తో పాటుగా కొంతమంది కంటెస్టెంట్స్ కి ఇదే జరిగింది బేబక్క విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరి నాగార్జున ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదని సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనేది తెలీదు. వీకెండ్ లో ఏం జరుగుతుందనేది చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news