వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉంది అంటూ షాకింగ్ విష్యం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది సెక్యూరిటీ రివ్యూ కమిటీ. ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించామని… అందుకే జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫారసు చేశామని హైకోర్టుకు నివేదించింది సెక్యూరిటీ రివ్యూ కమిటీ. జగన్ ను చచ్చే వరకు కొట్టాలన్న అయ్యన్నపాత్రుడి సంభాషణ స్పీకర్ కాక ముందుది.
అయ్యన్న ఇప్పుడు స్పీకర్ గా రాజ్యాంగ పదవిలో ఉన్నారని వివరించింది. ఆ వీడియోను పరిగణనలోకి తీసుకోకండి… జగన్ సొంత వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చుకునేందుకు అనుమతిచ్చామని హైకోర్టుకు నివేదించింది సెక్యూరిటీ రివ్యూ కమిటీ. ఈ కౌంటరు కు సమాధానం జగన్ న్యాయవాది ఇస్తామని చెప్పారు. ఇక ఈ విచారణను 13కి వాయిదా వేసింది హైకోర్టు.