వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు అవసరం : టీజీఎస్పీడీఎల్ సీఎండీ ఫారుఖీ

-

తెలంగాణలో వినాయక చవితి పండుగ కోసం అన్నిఏర్పాట్లు జరుగుతున్నాయి.గల్లీ గల్లీలో గణనాథులు కాసేపట్లో కొలువుదీరనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పూజ కార్యక్రమాల అనంతరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంణం కానున్నాయి.ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను మండపాల నిర్వాహకులు పూర్తిచేశారు. అయితే, ఈసారి మట్టిగణపతులకు ప్రజలు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మార్కెట్లో రంగురంగుల వినాయకులకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. ఆటపాటలు డప్పు కోలాహలంతో పిల్లలు, పెద్దలు గణనాధులను నిన్న రాత్రే మండపాల వద్దకు చేర్చారు.

అయితే, వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ హైదరాబాద్‌లో సూచించారు. మండపాలకు నిరంతరం విద్యుత్ సరఫరా, భద్రత ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని సమీక్షలో వెల్లడించారు. మండపాలకు విద్యుత్ సరఫరా కోసం సామాన్యులు విద్యుత్ స్థంభాలు ఎక్కకుండా సిబ్బందితోనే కనెక్షన్ తీసుకోవాలన్నారు.వైరింగ్ అసంపూర్తిగా ఉంటే వర్షాల వేళ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news