రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి కీలక అప్ డేట్..!

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది.  ఈ సినిమాకు దర్శకుడు శంకర్ కారణంగానే కాస్త ఆలస్యం అవుతోంది.   సాధారణంగా శంకర్ సినిమాలంటే భారీగా ఉండటమే కాకుండా.. షూటింగ్ కి కూడా చాలా సమయం పడుతుంది.  ఏ విషయంలోనైనా ఆయన కాంప్రమైజ్ అవ్వడు. అందుకే ఆయన సినిమాల రిలీజ్ చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పవచ్చు.

గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు.. ఒకటి రెండు పోస్టర్స్, టైటిల్ తో  పాటు ఒక సాంగ్ మాత్రమే విడుదల చేశారు. గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. ఈసారి మేకర్స్ పై ట్రెండ్ చేశారు. దీంతో నిన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ” గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయక చవితి 2024″ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా బీ.ఏ. రాజు టీమ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ ఈనెలలోనే రాబోతుందని.. వినాయకచవితి శుభాకాంక్షలు చెప్పారు. దీనికి తోడు ఓ పోస్టర్ ని విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news