మహారాష్ట్ర కోసం కాంగ్రెస్ స్కెచ్ వేసింది..రంగంలోకి ఏపీ నేతలను దించుతోంది. “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు కు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా భాద్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి పరిశీలకులుగా గిడుగు రుద్రరాజుకు భాద్యతలు తీసుకున్నారు.“బీడ్” లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు గిడుగు రుద్రరాజు.
“బీడ్” లోకసభ నియోజకవర్గ పరిధిలో జియోరాయ్, మజల్గావ్, బీడ్, ఆష్టి, కైజ్, పార్లీ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. “బీడ్” లోకసభ స్థానంలో గత ఎన్నికల్లో గెలుపొందింది ఎన్.సి.పి (శరద్ పవార్ వర్గం). మహరాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నానా పటేల్, రాష్ట్ర ఏఐసిసి ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ రమేష్ చెన్నితాల తో వెంటనే సమావేశం కావాలని గిడుగు రుద్రరాజు ను ఆదేశించింది కాంగ్రెస్ అధిష్ఠానం. మహారాష్ట్రలోని అన్ని లోకసభ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు భాద్యతలు అప్పగించారు. అయితే.. ఏపీ చీఫ్ షర్మిలకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు కాంగ్రెస్.