బండి సంజయ్ ఇజ్జత్ కు సవాల్ గా మారిన ఉత్తర తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలు..

-

ఎన్నికలు ఏవైనా.. బెటర్ ఫలితాలే లక్ష్యంగా తెలంగాణాలో బిజేపీ పావులు కదుపుతోంది.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నదాని కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన బిజేపీ.. లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే దూకుడును ప్రదర్శించింది.. నార్త్ తెలంగాణలో ఆ పార్టీ ఎంపీలు దున్నేశారు.. డిల్లీ లెవల్ లో తమ సత్తా ఏంటో అగ్ర నేతలకు చూపించారు.. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణాలో వస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారు కన్నేశారు..

ఉత్తర తెలంగాణాలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీ నేతలకు సవాల్ గా మారింది.. తేడా జరిగితే భవిష్యత్ తలకిందుల అయ్యే ప్రమాదం ఉండటంతో నేతలు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.. ముఖ్యంగా కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ కు స్వంత ఇలాకాలో భారీ సవాల్ ఎదురవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది.. తెలంగాణాలో ఎంపీ స్థానాలు గెలవడంతో కేంద్రం వారికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది.. ఈ సమయంలో కేంద్ర పెద్దలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనే తపనలో బిజేపీ ఎంపీలు, నేతలున్నారు..

లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగానాలో మంచి ఫలితాలను బిజేపీ సాధించింది.. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో వాటిపై సీరియస్ గా ఆ పార్టీ దృష్టి పెట్టింది.. గెలుపులో ఏమాత్రం తేడా కొట్టినా..
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎంపీల గెలుపు గాలి వాటమనే ముద్ర పడే అవకాశముంది..దీంతో కేంద్రమంత్రి బండి సంజయ్ తో పాటు.. ముగ్గురు ఎంపీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు..

పార్టీ కోసం కష్టపడిన వారికే టిక్కెట్ వస్తుందని బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు.. ఎన్నికల బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు పరోక్షంగా ఆయన క్యాడర్ కు చెబుతున్నారు.. ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ.. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల అభ్యర్దులకు ధీటుగా అభ్యర్దిని బరిలోకి దింపాలని ఆయన భావిస్తున్నారు.. ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని బండి ధీమా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆయన వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news