ఆయుష్మాన్ భారత్ కార్డును ఎలా పొందవచ్చు..? అర్హులో కాదో ఎలా తెలుసుకోవచ్చు..?

-

హాస్పిటల్ బిల్లులు పెరిగిపోవడంతో ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. అందుకే ఐదు లక్షలు వరకు ఉచిత వైద్యం హాస్పిటల్ ఖర్చు ఇచ్చే పథకాన్ని ఒకటి కేంద్రం తీసుకువచ్చింది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం. ఈ కార్డుతో ప్రతి ఏటా 5 లక్షల వరకు వైద్య చికిత్సల్ని ఉచితంగా తీసుకోవచ్చు. ఈ కార్డు పొందడానికి కొన్ని అర్హతలు నియమాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

Cabinet approves Rs 5 lakh health cover for senior citizens above 70 under Ayushman Bharat Scheme

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని సెప్టెంబర్ 23, 2018 లో తీసుకువచ్చారు. ఏడాదికి ఐదు లక్షల వరకు కవరేజీ లభిస్తుంది. ప్రీ హాస్పిటల్ ఎక్స్పెన్స్ కవరేజ్ మూడు రోజుల వరకు ఉంటుంది. పోస్ట్ హాస్పిటల్ కవరేజీ 15 రోజులు వరకు ఉంటుంది. ఇక ఆన్లైన్లో మీరు అర్హులు కాదో తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

  • ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి హోం పేజీలో ‘ఎం ఐ ఎలిజిబుల్’ సెక్షన్ లోకి వెళ్ళండి.
  • మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటిపి ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత మీ వివరాలను కూడా ఇచ్చేయండి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

నెలకు పదివేలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు అర్హులు కాదు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉంటే కూడా అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ కి అర్హులు కాదు. అయితే ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాలా విధాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి లేదంటే ఆయుష్మాన్ సెంటర్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కార్డు కూడా వారే ఇస్తారు. ఈ ప్రాసెస్ ని పూర్తి చేయడానికి ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గ్రామ రోజ్ గర్ సహాయక లేదా వార్డు ఇన్చార్జిని సంప్రదించి ఆయుష్మాన్ కార్డుని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news