మధ్యతరగతి కుటుంబాలకు పిల్లలు చదువు లేదంటే ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చాలా భారంగా ఉంటాయి. ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలని చింతిస్తూ ఉంటారు. అయితే బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పాలసీని తీసుకువచ్చింది. అదే ఎల్ఐసి కన్యా దాన్ పాలసీ. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ భయం లేకుండా ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి కన్యా దాన్ పాలసీని తీసుకొచ్చారు. పెళ్లికి మాత్రమే కాదు వాళ్ళ బంగారు భవిష్యత్తు కూడా ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ మొత్తం డిపాజిట్ చేసి పెళ్లి సమయానికి పెద్ద మొత్తం డబ్బుని కూడబెట్టొచ్చు.
13 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ పాలసీ టెన్యూర్ ఉంటుంది. కుమార్తె కోసం ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే వయస్సు 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి. కూతురు పేరు మీద ఈ పాలసీని తీసుకోవాలనుకుంటే ఒకటి నుంచి పదేళ్ల లోపు ఆమె వయసు ఉండాలి. ఎన్నారైలు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. దగ్గర్లోని ఎల్ఐసి ఆఫీస్ లేదా ఏజెంట్ ని సంప్రదించొచ్చు.
మీ అదాయాన్ని బట్టి ప్రీమియం పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సమాచారం కోసం ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. ఎల్ఐసి కన్యా దాన్ పాలసీలో 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 41,367 రూపాయలను మీరు చెల్లించినట్లయితే.. అంటే నెలకు 3447 కట్టాలి. మెచ్యూరిటీ సమయానికి మీకు 22.5 లక్షలు వస్తాయి, 25 ఏళ్ళు మెచ్యూరిటీ కాలం, 22 ఏళ్ళు మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్ళు గడిచిన తర్వాత 22.5 లక్షలు మీ కూతురు కోసం వస్తాయి.