తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కి బాధ్యతలను అప్పగించనున్నారు. అయితే ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెలో ఫైలెట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వగ్రామానికి కూడా సోలార్ విద్యుత్ రానుంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సొంత గ్రామాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్ల పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత గ్రామం సిరిపురంకు పైలట్ ప్రాజెక్టు కింద గృహ, వాణిజ్య అవసరాలతో పాటు రైతులకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్ల పంపిణీ చేయాలన్నారు. అలాగే ప్రతీ ఇంటికి ఉచిత సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క అధికారులను అదేశించారు.