తమ టాప్ కమాండర్ ని అమెరికా చంపిన నేపధ్యంలో ఇరాన్ కక్ష సాధించుకోవడం మొదలుపెట్టింది. తమ దేశం మీద పెత్తనం చేలాయించాలని భావిస్తున్న అమెరికాను ఇరాక్ నుంచి పంపించాలని ఇరాన్ భావిస్తుంది. ఈ నేపధ్యంలో ఇరాక్‌లోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో దాడి చేసింది. ఈ విషయాన్ని పెంటగాన్ ధ్రువీకరించింది. మంగళవారం రాత్రి ఈ దాడులు చేసింది ఇరాన్.
అల్ అసద్ స్థావరంపై తొమ్మిది క్షిపణులతో ఇరాన్ దాడిచేసినట్టు సమాచారం. మృతుల విషయమై ఇరాన్ అధికారిక మీడియా కీలక ప్రకటన చేసింది. తాము జరిపిన క్షిపణి దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ పేర్కొంది. ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. మొత్తం 15 క్షిపణులతో దాడిచేసినట్టు తెలిపింది. అమెరికా ఆగకపోతే మాత్రం 100 స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని,
ఈ దాడులను తీవ్ర తరం చేస్తామని ప్రకటించింది. అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచివెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే ఈ దాడిలో భారీగా అమెరికాకు భారీగా నష్ట౦ జరిగిందని అంటున్నారు. దాదాపు 300 మందికి పైగా అమెరికా సైనికులు మరణించారనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఇరాన్ మాత్రం అమెరికాకు చుక్కలు చూపించింది అంటున్నారు.