కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం అని ఢిల్లీకి కాబోయే నూతన సీఎం ఆతిషీ అన్నారు. అయితే తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆతిషీ.. కేజ్రీవాల్ నాపై నమ్మకంతో మరింత బాధ్యతలను అప్పజెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ పై తప్పుడు కేసులు పెట్టింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. అరవింద్ కేజ్రీవాల్ ను తిరిగి సీఎంగా ప్రజలు ఎన్నుకుంటారు అని పేర్కొంది.
అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఎంత నిజాయితీపరుడో ప్రజలకు తెలుసు. ఢిల్లీ ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్ ను సీఎం చేస్తారు. అప్పటివరకు ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు నిర్వహిస్తాను. నాకు శుభాకాంక్షలు పూలదండలు వద్దు . నాపై నమ్మకం ఉంచిన కేజ్రీవాల్ వరకు ధన్యవాదాలు . వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాను. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్, ఉచిత వైద్యం ఉండవు అని ఆతిషీ అన్నారు.