ఉప్పల్ పోలీస్‌స్టేషన్ కంపౌండ్‌‌‌‌లో యువకుల ఇన్‌స్టా రీల్స్.. వైరల్!

-

సోషల్ మీడియా రీల్స్ పిచ్చి జనాలకు వైరస్‌లా పట్టుకుంది. తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ కావాలని కొందరు శృతి మించుతున్నారు. ముందు వెనుకా ఆలోచించకుండా స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోగా.. మరికొందరి మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఎవరు ఎమనుకున్నా మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రీల్స్ చేసి ఫేమస్ అయ్యి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు కానీ, అది వారి జీవితంలో మరక లాగా మారే రోజులు వస్తాయని ఊహించలేకపోతున్నారు.

తాజాగా కొందరు యువకులు రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకున్నారు.హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ కంపౌండ్‌లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఆకతాయిలపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీస్‌స్టేషన్ అంటే లెక్క లేకుండా పోయిందని తిట్టిపోస్తున్నారు. ముందు వీళ్లని బొక్కలో వేయండి అంటూ ఓ నెటిజన్స్ కామెంట్ చేయగా..ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.మరో వ్యక్తి ఏకంగా సిటీ కమిషనర్‌కు ఈ వీడియోను ట్యాగ్ చేశాడు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news