టీటీడీ లడ్డూ తయారీ.. అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

-

టీటీడీ లడ్డూ తయారీ లో నెయ్యి అంశంపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని TTD EOకి ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

తిరుమల, తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.  అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారం పై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది వెల్లడించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news