BRSకు బిగ్‌ షాక్‌..తాటికొండ రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ అరెస్ట్‌ !

-

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించిన షాక్‌ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు..అరెస్ట్‌ చేయనున్నారట. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

BRS Tri-Member Committee for Study of Public Health Conditions

అయితే… ఇందులో భాగంగానే… డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఉదయం 10 గంలకు గాంధీ హాస్పిటల్ కు బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ వెళ్లనుంది. డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో.. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉన్నారు. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించనుంది త్రిసభ్య కమిటీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన నివేదికను అందించనుంది కమిటీ. అయితే.. ఈ తరుణంలోనే.. తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు..అరెస్ట్‌ చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news