చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు..చిట్టి నాయుడు నువ్వు నేర్చుకో !

-

చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పెన్షన్ పెంపుపై ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు. తెలంగాణలో చిట్టినాయుడు సోదరుల కంపెనీ నడుస్తుందని నిప్పులు చెరిగారు.

ktr praises over chandrababu naidu

ఇవాళ శేరిలింగంపల్లి లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో శేరిలింగంపల్లి లో ఉప ఎన్నిక వస్తుందని హెచ్చరించారు.

మంత్రి శ్రీధర్ బాబు తెలివిగా మాట్లాడు తున్నాడన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇద్దరు brs ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు అని శ్రీధర్ బాబు అంటున్నాడని తెలిపారు. మా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పడం చూడలేదా అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news