వైసీపీ అధినేత సంచలన నిర్ణయం.. ఖుషీలో మాజీ ఎమ్మెల్యే లు ..

-

పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.. గత ఎన్నికల సమయంలో తీసుకున్నకొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారు. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలకు పాత నేతలనే పంపుతున్నారు.. ఇటీవల ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది..

2024 ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. రాష్టంలోని సుమారు 70 నియోజకవర్గాలకు కొత్త అభ్యర్దులను ప్రకటించారు.. సిట్టింగ్ లను కాదని.. ఇన్చార్జులకు బాధ్యతలు అప్పగించారు..వారికే టిక్కెట్లు కేటాయించారు.. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో వారందరూ బొక్కబోర్లా పడ్డారు.. ఒక్కరు. ఇద్దరు తప్ప..మిగిలిన వారందరూ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు..దీంతో 151 స్థానాల నుంచి వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది..

సర్వేలు చేయించి.. జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో చాలా మందికి నచ్చలేదు.. కొందరు ధిక్కార స్వరం వినిపించగా.. మరికొందరు మాత్రం ఆయన చెప్పినట్లే కొత్త నియోకవర్గాలకు వెళ్లి పోటీ చేశారు.. అక్కడ ఫలితం తేడా కొట్టడంతో.. వారంతా అక్కడ ఉండలేక.. పాత నియోజకవర్గాలకు వెళ్లలేక జంక్షన్ లో ఉండిపోయారు. దీంతో ఈ వ్యవహారంపై జగన్ దృష్టి పెట్టారు..

సీనియర్లతో జరిగిన సమావేశంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారట.. ఓడిపోయిన వారిని పాత నియోజకవర్గాలకు పంపాలని.. దీనికోసం నేతలకు విడివిడిగా మాట్లాడేందుకు జగన్ సిద్దమవుతూ ఉండటంతో.. వారంతా ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.. ప్యూచర్ కోసం తమ కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారట.. పాత నియోజకవర్గాలకు వెళ్లితే తాము పార్టీని బలోపేతం చెయ్యగలమని.. జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఊపిరి పోసిందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news