మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..1,350 ఇళ్లకు హైడ్రా నోటీసులు!

-

మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన రాష్ట్ర సర్కార్ ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. గోల్నాక, చాదర్ ఘాట్,మూసారంబాగ్‌లోని ఆక్రమణలను తొలగిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ శని, ఆదివారాల్లో మూసీ నది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అనుమతి లేని నిర్మాణాలను కూల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్,బఫర్ జోన్‌లలో ఉన్న ఇండ్లను హైడ్రా మార్క్ చేసింది.

1,350 మందికి తాజాగా హైడ్రా నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం మూసీ రివర్ నివాసముండే ప్రాంతాలకు మేడ్చల్,రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు వెళ్లనున్నారు. అక్కడి ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా వారితో చర్చలు జరపనున్నట్లు సమాచారం.అయితే, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, అధికారుల బృందం ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news