బీసీని పీసీసీ చేస్తామనీ రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులూ వీ. హనుమంతరావు తెలిపారు. జనాభా ప్రతిపాదికన ఎవరి హక్కులు వారికే దక్కాలని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన చేయాలని.. సపరేట్ మినిస్ట్రీని ఇవ్వాలని బీజేపీని కోరాం పట్టించుకోలేదు. తెలంగాణలోని ఆరు డిక్లరేషన్లతో పాటు బీసీ కులగణన చేపడతామని పార్టీ చెప్పింది. మొన్నటి ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అనగానే బీసీనా రెడ్డినా అనేది చూడకుండా ఓట్లు వేశారు. బీసీ ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావు అని ఉత్తమ్ కు చెప్పాను.. ఉత్తమ్ కూడా ఒప్పుకున్నాడు. నేను రాజకీయాల్లోకి ప్రజా సేవ కోసం వచ్చాను కానీ భూములు.. డబ్బు కోసం కాదు.
బీసీ కులగణన బాధ్యత రేవంత్.. మహేష్ కుమార్ పైన ఉంది. అయితే రేవంత్ పక్కన చెప్పేటోళ్లు ఎక్కువయ్యారు. అసెంబ్లీలో బీసీ కులగణన బిల్ పాస్ అయ్యింది. త్వరలోనే మనకు న్యాయం జరుగుతుంది. త్వరగా బీసీ కులగణన చేస్తేనే మన నాయకుడు మాట్లాడగలడు. మీ రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయలేదు అని అడుగుతారు. కులగణన ఆలస్యం చేస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సమాధానం చెప్పలేడు అని వీహెచ్ పేర్కొన్నారు.