బీసీల కులగణన జరిగేది అప్పుడే.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..!

-

నాలుగైదు రోజుల్లో బీసీల కులగణన మార్గదర్శకాలు విడుదల చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీసీల రాష్ట్ర విస్తృత  సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల కుణగణన అనేది కాంగ్రెస్ పేటెంట్ అని.. ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీసీలకు రావాల్సిన వాటా, వారికి దక్కాల్సిన గౌరవంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదన్నారు.

ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని బీసీ నాయకులు చెబితే వారితో తాను మాట్లాడాడని.. కులగణన ప్రాసెస్ జరుగుతుందని చెప్పినట్టు వివరించారు. అనుమానం ఉంటే.. ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని.. తానే స్వయంగా వచ్చి ప్రభుత్వ ఆలోచనను మీ ముందు ఉంచుతానని తెలిపినట్టు వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలు తప్ప వారికి బీసీల పట్ల ప్రేమ లేదన్నారు. రాహుల్ గాంధీకి భయపడే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు అనుకూలం అని అంటున్నట్టు తెలిపారు. బీసీలంతా కాంగ్రెస్ లోకి వెళ్తారనే భయంతో అవసరానికి తగినట్టు బీజేపీ ప్రకటనలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news