విజయవంతమైన జీవితం కోసం 5 సూత్రాలు..!

-

ప్రతీ ఒక్కరు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. విజయవంతమైన జీవితానికి కొన్ని సూత్రాలని పాటించడం మంచిది. విజయం సాధించడం అంత ఈజీ కాదు అందరినీ వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్లాలంటే మీలో కొన్ని ప్రత్యేకతలు బాధ్యతలు ఉండాలి. అలాగే మీరు సక్సెస్ అవ్వాలంటే ఐదు నిమిషాల పూర్తి చేసే టాస్క్ ని ఇస్తే ముందు దానిని పూర్తి చేయాలి. తర్వాత అని పక్కన పెట్టకూడదు. చాలామంది పనులు చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే తర్వాత బాధపడక్కర్లేదు.

అలాగే హద్దుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పనిలో హద్దులు విధించుకోవడం చాలా కీలకం. ఎక్కువగా పని ఇస్తే పద్ధతిగా నో చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడే పనిని మీరు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలరు. మల్టీ టాస్కింగ్ వద్దు. ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేయడం వలన పొరపాట్లు జరుగుతాయి. అందుకే ఒకదాని పైన ఫోకస్ పెట్టండి. మీ పనుల్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి కొన్ని రకాల టూల్స్, యాప్స్ ని ఫాలో అవ్వడం వలన కొంచెం ఫాస్ట్ గా మీ పనులు అయిపోతాయి.

ప్రతి అరగంటకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. 25 నిమిషాల పని చేస్తే ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఇది మిమ్మల్ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది. మీ పనిని స్పీడ్ గా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు మీ రోజువారి పనుల్ని జాబితాగా రాసుకోండి వాటిని పద్ధతి ప్రకారం పూర్తి చేయాలి. దీని వలన పనులు చాలా ఈజీగా అయిపోతాయి. అలారాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా లక్ష్యాలని వేగంగా చేరుకుంటారు. డెడ్లైన్స్ ని గుర్తుపెట్టుకోవాలి ఒత్తిడి లేకుండా పనుల్ని పూర్తి చేసుకోవాలి ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news