మహారాష్ట్రలోని ఠాణే జిల్లా బద్లాపూర్ లోని ఓ పాఠశాలలో ఇద్దరూ చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. రాజీకీయంగా ఈ ఘటన పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ స్పందించారు. వారిపై కాల్పులు జరుపుతుంటే.. పోలీసులు చప్పట్లు కొడతారా..? అని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్లకు మేము వ్యతిరేకమని.. చట్టాలను కచ్చితంగా అనుసరించాలన్నారు.
చట్టాల ప్రకారమే నేరస్తులకు శిక్ష పడాలి. ఆ ప్రక్రియ అంతా వేగంగా జరగాలి. తమపై కాల్పులు జరుగుతుంటే.. పోలీసులు చప్పట్లు కొట్టరని.. ఆత్మరక్షణ కోసమే వారు నిందితుడిని కాల్చారని వెల్లడించారు. ఈ ఘటన పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. బద్లాపూర్ పాఠశాలలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితుడు అక్షయ్ శిండే పై అతని మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు పోలీసులు. ఇంతలోనే తలోజా జైలుకు వెళ్లి.. అక్కడి నుంచి నిందితుడుని కారులో బద్లాపూర్ కి తీసుకొని బయలుదేరారు. కారులో ఉన్న పోలీస్ అధికారి తుపాకి లాక్కొని కాల్పులు జరిపాడు నిందితుడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారి నిందితునిపై కాల్పులు జరపడంతో గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.