అమ్మవారిని ఇలా పూజిస్తే.. డబ్బే డబ్బు..!

-

శరన్నవరాత్రి మహోత్సవాలు లోక కళ్యాణార్థం దుష్టశక్తున్ని సంహరించి సకల జీవకోటికి శాంతిని కల్పించినందుకు దుర్గాదేవిని నవరాత్రులు కూడా పూజిస్తారు. భాష ఏదైనా సరే భావం ఒక్కటి అనే విధంగా అని రాష్ట్రాల్లో దుర్గాదేవిని నవరాత్రులు కూడా పూజలు చేయడం జరుగుతుంది. భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఉగ్రరూపిణిగా ఉండే దుర్గాదేవి అమ్మవారిని శాంతింప చేయడానికి తొమ్మిది రోజులు లోకమంతా పూజా కార్యక్రమాలని నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి. దుర్గాదేవి అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండపై భక్తులకి దివ్యదర్శనం ఇవ్వబోతున్నారు. అయితే అమ్మవారిని ఇలా ఆరాధిస్తే మాత్రం డబ్బుకి లోటుండదట.

ఈ నవరాత్రుల్లో మాంసాహారం తినే వాళ్ళు పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉదయాన్నే లేచి తల స్నానం చేసి అమ్మవారి చిత్రపటం దగ్గర కానీ విగ్రహం వద్ద కానీ కూర్చుని అమ్మవారి సహస్రనామాలు చెబుతూ కుంకుమతో పూజ చేయాలి. దూప దీప నైవేద్యాలని సమర్పించాలి. ఇలా చేయడం వలన భక్తులని అమ్మవారు చల్లగా చూస్తారట. కంటికి రెప్పలా కాపాడుకుంటారట.

తెలుగు లోగిలిలో ఉన్న నివాసాలు, ఆలయాలు శరన్నవరాత్రి మహోత్సవాలకు సిద్ధమయ్యాయి. విజయవాడలో రోజుకు ఒక అలంకారంతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. దుర్గ భవాని అమ్మవారిని ఎంతో గొప్పగా కాకుండా మనస్పూర్తిగా ఆరాధిస్తే అమ్మవారి ఆశీస్సులు నిండుగా లభిస్తాయి అని అర్షకులు తెలిపారు. అమ్మవారికి పెట్టడానికి పంచభక్ష పరమాన్నాలు లేనప్పటికీ పంచదార నైవేద్యంగా పెట్టి, అమ్మవారిని మనస్పూర్తిగా కొలిస్తే ఆమె వరాల కురిపిస్తారని చెప్పారు. ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news