చాలామంది అనేక రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొదుపు చేస్తూ ఉంటారు. NPS అనేది ప్రభుత్వం మద్దతు కలిగిన పదవీ విరమణ పొదుపు స్కీము. పన్ను ప్రయోజనాలని అందిస్తుంది. అలాగే పదవీ విరమణ కార్పస్ ని నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ముఖ్య ఫీచర్లలో ఒకటి పథకం సౌలభ్యం. 40 దాటిన వ్యక్తి అయితే దీనిలో ఎంత పెట్టుబడి పెడితే ఎంత పెన్షన్ వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
నేషనల్ పెన్షన్స్ సిస్టం ద్వారా 40 దాటినా వ్యక్తి పదవీ విరమణ తర్వాత ఐదు లక్షల కంటే ఎక్కువ నెలవారి పెన్షన్ ని పొందాలనుకుంటే.. ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది చూసి వస్తే.. 40 ఏళ్ల వయసులో ప్రతి నెలా లక్ష పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టి 65 ఏళ్ల వచ్చేవరకు కొనసాగిస్తే 12 శాతం వార్షిక రాబడిని అంచనా వేస్తే గణనీయమైన ఆర్థిక వృద్ధుని పొందవచ్చు. పదవి విరమణ సమయంలో ఆరు శాతం రేటుతో యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీరు సేకరించిన కార్పస్ లో 55% కేటాయిస్తే 5 లక్షల కంటే ఎక్కువ నెలవారి పెన్షన్ వస్తుంది.
పెట్టుబడులకు గ్యారెంటీ రిటర్న్స్ ఉండవని గమనించాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతాయి. 40 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమయ్యే వారితో పోల్చుకుంటే 30 ఏళ్ల వయసు నుంచి ప్రారంభమయ్యే వ్యక్తికి చివరిలో పెద్ద కార్పస్ ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఇలా పెట్టుబడి పెట్టి అద్భుతమైన రాబడిని పొందవచ్చు