టీ20 మహిళా ప్రపంచకప్..డూ ఆర్ డై మ్యాచులకు టీమిండియా సిద్ధమా?

-

మహిళల టీ20 ప్రపంచ కప్‌ తొలి గ్రూప్ స్టేజీ మ్యాచులో టీమిండియా తడబడింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో కివీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. సోఫీ డివైన్ నేతృత్వంలోని కివీస్ జట్టు సమిష్టిగా రాణించి టీమిండియాను 58 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో న్యూజిలాండ్ తొలి విజయాన్ని అందుకోగా.. భారత్ తొలి ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచు గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేయగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఈ ఓటమితో టీమిండియా -2.900 నెట్‌రన్ రేటుతో గ్రూప్ -ఏ నుంచి చివరిస్థానంలో నిలిచింది. భారత మహిళల జట్టు సెమీస్ చేరాలంటే మిగతా మూడు మ్యాచులు (ఆస్ట్రేలియా, పాక్, శ్రీలంక)తో తప్పనిసరిగా గెలవాలి. అంతేకాకుండా బెటర్ రన్ రేట్ అవసరం. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఎలాగూ సెమీస్ చేరుతుందని అంచనాలు ఉన్నాయి. కానీ, భారత్ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లు రెండేసి మ్యాచులు ఓడాలి. వాటి రన్ రేట్ మనకంటే తక్కువగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news