ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా బతుకమ్మ సంబురాలు

-

తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్నారు. ఇవాళ సద్దుల బతుకమ్మ కావడంతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ సంబురాలను జరుపుతుంది. తెలంగాణలోని పల్లెటూర్లలోని గల్లీల నుంచి రాజధాని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వరకు అంతటా మహిళలు బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ అంతా మారు మ్రోగుతోంది. ఓవైపెు కళాకారులు, మరోవైపు మహిళలు ట్యాంక్ బండ్ కన్నుల పండుగగా కనిపిస్తోంది.

ముఖ్యంగా ఈసారి డీజీలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం సొంతంగా పాటలు పాడేలా ఏర్పాట్లు చేసింది. ఇలా ఏర్పాటు చేయడంతో మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పల్లెలు అయితే ఉయ్యాల పాటలతో ఊగిపోతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ట్యాంక్ బండ్ వద్ద మంత్రి సీతక్క తలపై బతుకమ్మతో వెళ్లారు. ట్యాంక్ బండ్ అంతా బతుకమ్మలతో కళకళలాడుతోంది. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. కొంత మంది రాజకీయ నేతలు కూడా ఈ సంబురాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు.

Read more RELATED
Recommended to you

Latest news