సిద్ధూ జొన్నలగడ్డ ‘కోహినూర్’.. హ్యాట్రిక్ గా ఊహించని ప్రాజెక్ట్..!

-

టాలీవుడ్ లేటెస్ట్ షైనింగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమా వచ్చి సూపర్ హిట్ సాధించాయి. ఈ కాంబినేషన్ లో మరో మూవీ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తారు అభిమానులు. హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా ఊహించని సబ్జెక్ట్ తో రాబోతున్నారు.

ఇవాళ విజయదశమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో సిద్దూ గెటప్ ఆకట్టుకుంటోంది. అదేవిధంగా సినిమాకి కోహినూర్ అనే పేరు కూడా ప్రకటించారు. పోస్టర్ పై పార్ట్ 1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్టు తెలుస్తోంది. సిద్ధూ ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం కోసం ప్రతిభగల ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపుతో చేతులు కలిపారు. ప్రత్యేకమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలో అడుగుపెట్టంనుందని.. ఈ చిత్రంతో మరో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తామని నిర్మాతలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news