మూడు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు.  నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు.

మరోవైపు.. డిమాండ్ కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు. క్రమంగా కూరగాయలు, వంట నూనెలు ఇలా అన్ని వస్తువుల ధరలు పైపైకి కదులుతోన్న సమయంలో టమోటాలు, ఉల్లిగడ్డ, వంట నూనెల.. ఇలా కొన్నింటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తోన్న విషయం విదితమే. 

Read more RELATED
Recommended to you

Latest news