తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని కొత్త లుక్..!

-

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. గతంలో జుట్టూ, గుబురు గడ్డంతో కనిపించేవారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇవాళ తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన తరువాత ఆయన నున్నటి గుండుతో కనిపించారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం బయటికి వచ్చిన కొడాలి నానితో అభిమానులు ఫొటోలకు పోజులిచ్చారు.

నిన్న, మొన్నటి వరకు ఒకవిధంగా ఉన్న కొడాలి నాని.. తాజాగా ఉన్న గెటప్ ను చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. కొడాలి ఫొటో చూసిన వారందరూ న్యూ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నున్నటి గుండుతో కొడాలి చాలా అందంగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news